లాల్ లక్ష్మీపురం గ్రామపంచాయతీలో తొలిసారిగా ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పంచాయతీ కార్యదర్శి సైదులు జెండా ఆవిష్కరణ – వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ పర్వతం చిన్న వెంకన్నమువ్వన్నెల పతాకం రెపరెపలతో గ్రామంలో వెల్లువెత్తిన దేశభక్తి
నేరేడు చర్ల, జనవరి 26, డైనమిక్ న్యూస్ నేరేడు చర్ల మండల పరిధిలోని నూతనంగా ఏర్పాటుైన లాల్ లక్ష్మీపురం గ్రామపంచాయతీలో తొలిసారిగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి సైదులు జాతీయ జెండాను ఆవిష్కరించగా, గ్రామ సర్పంచ్ పర్వతం చిన్న వెంకన్న వేడుకల్లో పాల్గొని దేశభక్తిని చాటారు. గ్రామపంచాయతీ ప్రాంగణంలో మువ్వన్నెల పతాకం రెపరెపలతో ఎగిరిపడుతుండగా గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. దేశభక్తి నినాదాలతో మార్మోగిన ప్రాంగణం జెండా ఆవిష్కరణ అనంతరం గ్రామస్తులు “జైహో భారత్”, “వందేమాతరం” నినాదాలతో కార్యక్రమాన్ని ఉత్సాహంగా కొనసాగించారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ వేడుకల్లో పాల్గొని దేశభక్తిని ప్రదర్శించారు. సర్పంచ్...