ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి అత్యంత శక్తివంతమైన ఆయుధం– జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,25 జనవరి 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి అత్యంత శక్తివంతమైన ఆయుధమని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు అయి బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. యువత చైతన్యమే బలమైన ప్రజాస్వామ్యం దేశంలోని యువతను చైతన్యం చేసేందుకు వివిధ రకాల ఓటరు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. ఓటు హక్కు వినియోగంలో నిర్లక్ష్యం చేయవద్దని, ప్రతి ఓటరు చైతన్యవంతుడిగా మారాలని సూచించారు. గ్రామీణ ఓటర్లు...