మేరా భారత్ మహాన్ ఎక్స్‌క్లూజివ్ సర్వీస్ అవార్డ్‌కు కుక్కమూడి ప్రసాద్ పల్నాడు జిల్లా దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడికి ఘన సత్కారం

దుర్గి,జనవరి 25 , డైనమిక్ న్యూస్ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం ముటుకూరు గ్రామానికి చెందిన దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, పల్నాడు జిల్లా ఎస్సీ–ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కుక్కమూడి ప్రసాద్ అలియాస్ ప్రసాదరావుకు మేరా భారత్ మహాన్ ఎక్స్‌క్లూజివ్ సర్వీస్ అవార్డ్–2026 లభించింది. రిపబ్లిక్ డే సందర్భంగా అవార్డు ప్రదానం మార్కాపురం జిల్లా కేంద్రంలోని మార్కాపురం ప్రెస్ క్లబ్‌లో, గ్లోబల్ హెల్ప్ ఫౌండేషన్ ఫౌండర్ & చైర్మన్ గాట్టేముక్కల చెన్నకేశవులు ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే (జనవరి 26) సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న విశిష్ట వ్యక్తులకు అవార్డులు ప్రదానం చేశారు. ప్రముఖుల చేతుల...