18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు నమోదు చేసుకోవాలి 16వ జాతీయ ఓటర్ల దినోత్సవంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపు

సూర్యాపేటబ్యూరో, డైనమిక్ న్యూస్,జనవరి 25 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఫారం-6 ద్వారా తమ పేరు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. ఆదివారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఓటర్లలో అవగాహన, పాల్గొనడం లక్ష్యం ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటర్ల దినోత్సవాన్ని ఓటర్లలో అవగాహన కల్పించడానికీ, ఎన్నికల ప్రక్రియలో సమాచారంతో కూడిన భాగస్వామ్యాన్ని పెంపొందించడానికీ జరుపుకుంటున్నామన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకొని మంచి పరిపాలన అందించే నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత...