మాసాయిపేటలో ఘనంగా జాతీయ 16వ ఓటర్ దినోత్సవం భారీ ర్యాలీతో ఓటు హక్కుపై చైతన్యంవృద్ధ ఓటర్లకు ఘన సన్మానం

డైనమిక్ న్యూస్, మాసాయిపేట / జనవరి 25 ర్యాలీతో ప్రజల్లో అవగాహన మాసాయిపేట మండల కేంద్రంలో జాతీయ 16వ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తాసిల్దార్ జ్ఞానజ్యోతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, బూత్ లెవెల్ ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాడవాడలా నినాదాలు మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి “ఓటు మన హక్కు – ప్రజాస్వామ్యానికి పునాది” అంటూ నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కుపై ప్రతిజ్ఞ ర్యాలీ అనంతరం తాసిల్దార్ జ్ఞానజ్యోతి ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రతిజ్ఞ చేయించారు. వృద్ధ ఓటర్లకు సన్మానం...