జై జవాన్ – జై కిసాన్ – జై విజ్ఞాన్ – జై అనుసంధాన్ : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మట్టపల్లిలో వ్యవసాయ కళాశాల, నవోదయ విద్యాలయాలకు శంకుస్థాపన రైతులు, విద్యార్థులకు ఉపయోగపడే అభివృద్ధి పనులు ప్రారంభం

సూర్యాపేట బ్యూరో , డైనమిక్ న్యూస్,జనవరి 23 వ్యవసాయం ఒక విజ్ఞానమని, గతంలో ఉన్న జై జవాన్ – జై కిసాన్ నినాదం కాలక్రమంలో జై జవాన్ – జై కిసాన్ – జై విజ్ఞాన్గా మారిందని, ప్రస్తుతం అది జై జవాన్ – జై కిసాన్ – జై విజ్ఞాన్ – జై అనుసంధాన్గా విస్తరించిందని రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దర్శనం శుక్రవారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సతీ సమేతంగా గవర్నర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి వేదాశీర్వచనం ఇచ్చి...