జానపహాడ్ దర్గా ఉర్సు ఉత్సవానికి పటిష్ట భద్రత శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి – జిల్లా ఎస్పీ నరసింహ
పాలకవీడు, జనవరి 23– డైనమిక్ న్యూస్ జానపహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలను సోదరభావంతో, శాంతియుతంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. గురువారం ఆయన ఉత్సవాలు జరుగనున్న ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. దర్గా సందర్శన.. ప్రత్యేక ప్రార్థనలు ఉత్సవాల నేపథ్యంలో ఎస్పీ జానపహాడ్ దర్గా సందర్శించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు ఐక్యతతో కలిసి ఉత్సవాలను జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సీసీ కెమెరాలతో నిఘా ఉత్సవ ప్రాంతంలో మొత్తం 65 సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. దర్గా పరిసరాలు, పార్కింగ్ ప్రాంతాలు, రాకపోకల మార్గాలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని వెల్లడించారు....