చీరాల ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలురోగుల పట్ల సేవాభావంతో వైద్యం అందించాలి– జిల్లా మలేరియా అధికారి వి. నాగార్జున రావు

చీరాల, డైనమిక్ న్యూస్, జనవరి 22 వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సిబ్బంది సేవా భావంతో వ్యవహరించాలని బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి. నాగార్జున రావు వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం ఆయన చీరాల ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతను ఆయన నిశితంగా పరిశీలించి, స్వచ్ఛత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోగులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. ల్యాబ్ రిజిస్టర్‌లు, పరీక్షల పరిశీలన ల్యాబ్ రిజిస్టర్‌లను పరిశీలించిన జిల్లా అధికారి, ప్రయోగశాలలో నిర్వహించే పరీక్షలు నిబంధనలు, ప్రమాణాల ప్రకారమే జరగాలని ఆదేశించారు. జ్వరం కేసుల...