మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి— జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,జనవరి 22 మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినికి తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ సమగ్ర వివరాలు అందజేశారు. జిల్లాలో 475 పోలింగ్ కేంద్రాలు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మొత్తం 475 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిజర్వేషన్ల అమలు పూర్తయ్యిందని, ఎన్నికల నిర్వహణ కోసం 70 మంది రిటర్నింగ్ అధికారులు...