నేరేడుచర్లలో బిఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభం రామాలయంలో ప్రత్యేక పూజలతో శుభారంభం

నేరేడుచర్ల , డైనమిక్ న్యూస్, జనవరి 22 నేరేడుచర్ల మండల కేంద్రంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బిఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారాన్ని గురువారం పార్టీ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ఘనంగా ప్రారంభించారు. బిఆర్ఎస్ సీనియర్ నేతల భారీ పాల్గొనడం ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేఎల్‌ఎన్ రెడ్డి, అప్పిరెడ్డి, శ్రీధర్ బాబు, సురేష్ బాబు, సైదులు, వెంకటరెడ్డి, జయాబాబు పాల్గొన్నారు.అలాగే సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు పెద్ద సంఖ్యలో హాజరై ప్రచారానికి మద్దతు తెలిపారు. బిఆర్ఎస్ గెలుపు ఖాయం – ఒంటెద్దు నరసింహారెడ్డి ఈ సందర్భంగా ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ,రానున్న మున్సిపల్ ఎన్నికల్లో హుజూర్నగర్, నేరేడుచర్ల...