నేరేడుచర్లకు అభివృద్ధి బాటమూడేళ్లలో మున్సిపాలిటీ రూపురేఖలు మార్చుతా పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే నా సంకల్పం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్,జనవరి 20 రానున్న మూడేళ్లలో నేరేడుచర్ల మున్సిపాలిటీని సమగ్ర అభివృద్ధితో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టిగా చెప్పారు. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా పాలన సాగించడమే తన ప్రజాజీవిత సంకల్పమని స్పష్టం చేశారు. మహిళా శక్తికి ఆర్థిక భరోసా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఆవరణలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలోని 404 స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ.52,07,399 వడ్డీ లేని రుణాల చెక్కులను మంత్రి అందజేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందిరమ్మ చీరలతో గౌరవం – భరోసా ఇందిరా మహిళా శక్తి పథకం...