నేడు నేరేడుచర్ల–హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్,జనవరి 20 రాష్ట్ర మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు నేరేడుచర్ల, హుజూర్‌నగర్ నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తూ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాలు మధ్యాహ్నం 01.30 గంటలకు నేరేడుచర్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొంటారు.అనంతరం సాయంత్రం 07.00 గంటలకు హుజూర్‌నగర్‌లోని మంత్రిగారి నివాసంలో మరో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ మధ్యాహ్నం 02.00 గంటలకు నేరేడుచర్ల మున్సిపాలిటీలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపిణీ చేయనున్నారు.అలాగే 04.00 గంటలకు హుజూర్‌నగర్...