సంక్రాంతి తిరుగు ప్రయాణాలపై పోలీసుల అప్రమత్తత 450 మంది సిబ్బందితో ప్రత్యేక ట్రాఫిక్ బందోబస్తు డ్రోన్లతో గాలిలో నుంచే పర్యవేక్షణ
నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,జనవరి 18 సంక్రాంతి పండగ ముగించుకుని ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ దిశగా తిరుగు ప్రయాణాలు భారీగా కొనసాగుతున్న నేపథ్యంలో, ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంతో పాటు రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పోలీస్ శాఖ సమగ్ర చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జాతీయ రహదారులపై ప్రత్యేక ఏర్పాట్లు నల్లగొండ జిల్లా పరిధిలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ముఖ్య కూడళ్ల వద్ద వాహనాల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, 450 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాటు చేసి నియంత్రణ చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. డ్రోన్లతో నిరంతర నిఘా వాహన రద్దీ...