నేడు నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి విస్తృత పర్యటన కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
నల్లగొండ బ్యూరో, జనవరి 17, డైనమిక్ న్యూస్ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(నేడు )శనివారం నల్లగొండ జిల్లాలో పర్యటించి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. 24 గంటల తాగునీటి పథకానికి శ్రీకారం ఉదయం 10 గంటలకు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ 34వ వార్డు V.T కాలనీ టెంపుల్ వద్ద రూ. 2 కోట్ల వ్యయంతో 24 గంటల పాటు నిరంతర తాగునీటి సరఫరా అందించే పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. పార్కుల అభివృద్ధి, బీటీ రోడ్డు విస్తరణ ఉదయం 10.30 గంటలకు చింతల్, రామ్‌నగర్, రాజీవ్...