పడగ విప్పిన పాతకక్షలు.. రామచంద్రపురం తండాలో ఉద్రిక్తత పరస్పర దాడుల ఆరోపణలు – భయాందోళనలో తండావాసులు పోలీసులు రంగంలోకి.. విచారణ ప్రారంభం

మఠంపల్లి, డైనమిక్ న్యూస్, జనవరి 16 సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రామచంద్రపురం తండాలో గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం పాత రాజకీయ కక్షలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇరువర్గాలు పరస్పరం భౌతిక దాడులకు పాల్పడ్డారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల ఓటమి తర్వాత గ్రామం విడిచిన మాజీ సర్పంచ్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటమి చెందిన అనంతరం మాజీ సర్పంచ్ మాలోతు భీముడు నాయక్ తన కుటుంబ సభ్యులతో కలిసి హుజూర్‌నగర్‌కు మకాం మార్చి అక్కడే నివాసం ఉంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటీవల తన స్వగ్రామానికి వచ్చిన ఆయన తెల్లవారుజామున ఒంటరిగా మోటార్ బైక్‌పై పొలాన్ని చూసేందుకు బయలుదేరారు....