మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలి:జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశం

నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్ ,జనవరి 16 రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల అంశంపై ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం రిజర్వేషన్ల అమలుకు అన్ని చర్యలు కచ్చితంగా చేపట్టాలని సూచించారు. జీవో నిబంధనల కచ్చిత అమలు అవసరం మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేసే సమయంలో...