దేశ రక్షణలో సైనికుల త్యాగాలు అమూల్యమైనవి సరిహద్దు వీరుడికి ఘన నిరాజనం సైనికుడి కాళ్లు కడిగి గౌరవం తెలిపిన రాపోలు నవీన్ కుమార్
గరిడేపల్లి , డైనమిక్ న్యూస్,జనవరి 16 భారత సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని గరిడేపల్లి మండలం కల్మల్ చెర్వు గ్రామంలో అరుదైన, భావోద్వేగపూరిత సంఘటన చోటుచేసుకుంది. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న సైనికుల పట్ల తనకున్న అపారమైన గౌరవాన్ని చాటుకుంటూ రాపోలు నవీన్ కుమార్ స్థానిక సైనికుడు వట్టే దశరద్ యాదవ్‌కు ఘన నిరాజనం సమర్పించారు. జవాన్‌కు పాదపూజ చేసి కృతజ్ఞతలు ఈ సందర్భంగా నవీన్ కుమార్ సైనికుడి కాళ్లు కడిగి పుష్పాలు సమర్పించి దేశ రక్షకులకు సమాజం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. సరిహద్దుల్లో మంచుకొండలు, తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో దేశ భద్రతే పరమావధిగా జీవితం అంకితం చేస్తున్న జవాన్లకు ఇది గౌరవ...