అరైవ్ – ఎలైవ్’ రోడ్డు భద్రత ఉద్యమం ప్రారంభం రోడ్డు ప్రమాద రహిత సూర్యాపేటే లక్ష్యం : జిల్లా ఎస్పీ కె. నరసింహ

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్ 13 జనవరి రోడ్డు ప్రమాదాల రహిత సూర్యాపేట జిల్లా నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘అరైవ్ – ఎలైవ్’ (సురక్షిత గమ్యం – సజీవ ప్రయాణం) కార్యక్రమం కేవలం ఒక్కరోజు కార్యక్రమం కాదని, ఇది ఒక నిరంతర సామాజిక ఉద్యమం అని జిల్లా ఎస్పీ కె. నరసింహ స్పష్టం చేశారు. కిరాణా ఫ్యాన్సీ మర్చంట్ హాల్‌లో కార్యక్రమ ప్రారంభం మంగళవారం జిల్లా కేంద్రంలోని కిరాణా ఫ్యాన్సీ మర్చంట్ హాల్‌లో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. రోడ్డు భద్రతపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని, ప్రమాదాల...