గ్రామీణ యువతకు ప్రపంచ వేదికే లక్ష్యం – సూర్యాపేటలో సీఎం కప్–2025 క్రీడా ర్యాలీ ప్రారంభం
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్,జనవరి 13 గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసి పల్లె నుంచి ప్రపంచ స్థాయికి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్–2025 క్రీడా పోటీలను నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ ర్యాలీకి జిల్లా ఎస్పీ కె. నరసింహతో కలిసి కలెక్టర్ హాజరై క్రీడా టార్చ్ వెలిగించి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి సంతోష్ బాబు చౌరస్తా మీదుగా సద్దల చెరువు వరకు సాగింది. గ్రామం నుంచి...