హుజూర్‌నగర్‌లో ‘ప్రత్యేక పాలన’ నడుస్తోంది – కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఘాటు విమర్శలు

నేరేడు చర్ల, డైనమిక్ న్యూస్, జనవరి 11 హుజూర్‌నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని పక్కనబెట్టి ఒక ‘ప్రత్యేక రాజ్యాంగం’ అమలు చేస్తున్నట్లు వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ పోలీస్ యంత్రాంగాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.ఈ వ్యాఖ్యలు నేరేడు చర్ల మండల పరిధిలోని ఏ–1 ఫంక్షన్ హాల్‌లో ఆదివారం జరిగిన నేరేడు చర్ల పట్టణ బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన చేశారు. సమావేశానికి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పోలీసులపై రాజకీయ ఒత్తిడి పెరుగుతోందన్న ఆరోపణ మఠంపల్లి, గరిడేపల్లి మండలాల్లో...