చైనా మాంజాపై నేరేడుచర్ల పోలీసుల కఠిన నిఘా సంక్రాంతి నేపథ్యంలో ప్రత్యేక చర్యలు
నేరేడు చర్ల, డైనమిక్ న్యూస్, జనవరి 9 సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగరేసే సమయంలో చైనా మాంజా వాడకం వల్ల ప్రమాదాలు పెరిగే అవకాశం ఉండటంతో నేరేడుచర్ల మండల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో మండల వ్యాప్తంగా నిషేధిత చైనా మాంజాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. హుజూర్నగర్ రోడ్డులో షాపుల తనిఖీ మండలంలోని హుజూర్నగర్ రోడ్డులో ఉన్న శివదుర్గ షాప్ సహా పలు దుకాణాలను శుక్రవారం ఎస్‌ఐ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ చేశారు. చైనా మాంజా విక్రయం, నిల్వలపై ప్రత్యేకంగా పరిశీలించి, నిషేధిత వస్తువులు ఉన్నాయా లేదా అన్నది తనిఖీ చేశారు. నిషేధిత మాంజాపై చట్టపరమైన చర్యలు ఈ సందర్భంగా ఎస్‌ఐ రవీందర్...