ఉద్యానవన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి— ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచన

మాచర్ల, డైనమిక్ న్యూస్, జనవరి 9 నియోజకవర్గ పరిధిలో రైతుల ఆదాయం పెంపొందించేందుకు ఉద్యానవన పంటల సాగుపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అధికారులకు సూచించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను గుర్తించి రైతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఉద్యాన శాఖ అధికారులతో సమీక్ష గురువారం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్యాన శాఖ అధికారులతో సమావేశమై, నియోజకవర్గంలో ఉద్యానవన పంటల సాగు విస్తరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు లాభదాయకమైన పంటలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలపై అవగాహన ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న పామాయిల్, జామాయిల్, చింత, కుంకుడు, సీతాఫలం,...