నరసరావుపేట నియోజకవర్గానికి భారీ ఆరోగ్య మౌలిక వసతులురూ.44.914 కోట్లతో 19 నూతన ఆరోగ్య కేంద్రాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

నరసరావుపేట, డైనమిక్ న్యూస్, జనవరి 9 ప్రజల ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యం నరసరావుపేట నియోజకవర్గ ప్రజల ఆరోగ్య సంరక్షణ విషయంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ముందువరుసలో నిలుస్తున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రశంసించారు. గత నెలలో జిల్లా డ్రగ్ నియంత్రణ కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే నిరంతర కృషికి ఫలితం నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు చేసిన నిరంతర ప్రయత్నాల ఫలితంగా, రూ.44.914 కోట్ల వ్యయంతో 19 నూతన ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. మంజూరైన ఆరోగ్య...