మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ– ప్రజలు ఆన్లైన్ సేవలు వినియోగించుకోవాలి : జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్
బాపట్ల, డైనమిక్ న్యూస్, జనవరి 8 చీరాల పట్టణంలో జాతీయ రహదారి NH–216పై ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) కార్యాలయాన్ని గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనూహ్యంగా కలెక్టర్ కార్యాలయానికి రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. రికార్డులు, సేవలపై సమీక్ష కార్యాలయంలోని రికార్డుల గదిని పరిశీలించిన కలెక్టర్, రవాణా శాఖ ద్వారా అందిస్తున్న సేవలు ఆన్లైన్ విధానంలో ఎలా అమలవుతున్నాయనే అంశంపై సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. దరఖాస్తుదారులతో నేరుగా సంభాషణ ప్రాంగణంలో వేచి ఉన్న దరఖాస్తుదారులను కలెక్టర్ పలకరించి, వారికి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు రవాణా శాఖ ద్వారా అందించాల్సిన సేవలపై...