విద్యతో పాటు క్రీడలు అవసరం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో అంతర్ పాఠశాలల క్రీడా పోటీల ప్రారంభం

నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,జనవరి 8 మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలంటే విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్గొండ జిల్లా చర్లపల్లి సమీపంలోని విపస్య పాఠశాలలో నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్ పాఠశాలల క్రీడా పోటీలను జ్యోతి వెలిగించి మంత్రి ప్రారంభించారు. క్రీడలతో చురుకుదనం పెరుగుతుంది ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు చురుకుగా, ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. కొన్ని పాఠశాలలు కేవలం అధిక జీపీఏల సాధనకే పరిమితమవుతున్నాయని, విద్యతో పాటు క్రీడలపైనా సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గెలుపు–ఓటములను...