డ్రగ్ ఫ్రీ సూర్యాపేటకు విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లుడ్రగ్స్‌కు వ్యతిరేకంగా కదం తొక్కిన యువత

సూర్యాపేట బ్యూర్, డైనమిక్ న్యూస్,జనవరి 8 భవిష్యత్‌పై కలలు కని వాటిని సాకారం చేసుకునే దిశగా విద్యార్థులు నిరంతరం కృషి చేయాలని జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ లక్ష్మీ శారద పిలుపునిచ్చారు. డ్రగ్స్ అనే మహమ్మారి యువత జీవితాలను నిర్వీర్యం చేస్తోందని, వాటిని సమాజం నుంచి నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా డ్రగ్ ఫ్రీ ఇండియా ర్యాలీ జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేట పట్టణంలో డ్రగ్ ఫ్రీ ఇండియా అవగాహన ర్యాలీ నిర్వహించారు. కోర్టు భవనం నుంచి ప్రారంభమైన ర్యాలీ సంతోష్‌బాబు...