అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్‌లో మరో విడత – రెండేళ్లలో రెండు విడతలు హుజూర్నగర్‌లో 2160 ఇళ్ల మోడల్ కాలనీ మార్చి 31లోగా పూర్తి – రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్,జనవరి 7 రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏప్రిల్‌లో మరో విడతగా, రానున్న రెండేళ్లలో రెండు విడతలుగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు. పేదవాడికి భద్రత, భరోసా ఇచ్చే కార్యక్రమం పేదవాడికి పూర్తి భద్రత, భరోసా, ధైర్యం ఇచ్చే పథకమే ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమమని మంత్రి పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రం సమీపంలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న 2160 ఇందిరమ్మ ఇళ్ల కాలనీని ఆయన...