చరిత్రకారుడు సయ్యద్ నశీర్ అహమ్మద్ జీవితం స్ఫూర్తిదాయకం టార్చ్ బేరర్ సయ్యద్ నశీర్ అహమ్మద్” పుస్తక ఆవిష్కరణ
డైనమిక్ న్యూస్,గుంటూరు, జనవరి 6 తెనాలి పట్టణంలోని వివేక సెంట్రల్ స్కూల్ ఆడిటోరియంలో ప్రముఖ చరిత్రకారులు సయ్యద్ నశీర్ అహమ్మద్ 70వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆయన జీవన విశేషాలతో రూపొందిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. డెన్మార్క్ తెలుగు సంఘం అధ్యక్షుడి చేతుల మీదుగా ఆవిష్కరణ ప్రముఖ జర్నలిస్టు బి.ఎల్. నారాయణ రచించిన “టార్చ్ బేరర్ సయ్యద్ నశీర్ అహమ్మద్” పుస్తకాన్ని గుంటూరులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు డెన్మార్క్ నుంచి విచ్చేసిన పొట్లూరి అమర్నాథ్ (వ్యవస్థాపక అధ్యక్షుడు – డెన్మార్క్ తెలుగు సంఘం & మన సంస్కృతి, డెన్మార్క్) ఆవిష్కరించారు. సయ్యద్ నశీర్ అహమ్మద్‌కు ఘన సన్మానం ఈ సందర్భంగా సయ్యద్...