హుజూర్‌నగర్‌లో డూప్లికేట్ నిత్యావసర సరుకుల సరఫరా కలకలం పారాషూట్ కొబ్బరినూనె, మైసూర్ సాండల్ సబ్బుల పేరుతో నకిలీ వస్తువుల విక్రయం

హుజూర్‌నగర్, జనవరి6 – డైనమిక్ న్యూస్ స్థానిక వర్తక సంఘం అప్రమత్తత హుజూర్‌నగర్ పట్టణంలో డూప్లికేట్ నిత్యావసర సరుకుల సరఫరా కలకలం రేపింది. పారాషూట్ కొబ్బరినూనె, మైసూర్ సాండల్ సబ్బులుగా అనుమానాస్పద సరుకులను సరఫరా చేస్తూ టాటా ఏసీ వాహనం తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో స్థానిక వర్తక సంఘ సభ్యులు అప్రమత్తమయ్యారు. వెంటనే వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేపట్టారు. నకిలీ సరుకులపై అనుమానం వాహనంలో ఉన్న సరుకులు నకిలీవా? లేక అసలైనవేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరుకులకు సంబంధించిన బిల్లులు, అనుమతులు సక్రమంగా లేవని వర్తకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ అవసరమని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయతీ...