మున్సిపాలిటీల్లో ఓటర్ జాబితా అభ్యంతరాలపై క్షేత్రస్థాయి పరిష్కారం అధికారులకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశాలు

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, జనవరి 6 మున్సిపాలిటీలలో ముసాయిదా ఓటర్ జాబితాపై స్వీకరించిన పిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ వెంటనే పరిష్కరించి, ఖచ్చితమైన తుది ఓటర్ జాబితా రూపొందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గుర్తింపు పొందిన పార్టీలతో సమీక్ష సమావేశం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లు, సిబ్బందితో ఓటర్ జాబితా తయారీపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. 141 వార్డులలో ముసాయిదా జాబితా ప్రచురణ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల పరిధిలోని 141 వార్డులలో...