మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశాలు
నల్గొండబ్యూరో, జనవరి 6, డైనమిక్ న్యూస్ రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు మున్సిపాలిటీ ఎన్నికలను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లతో సంసిద్ధత సమావేశం మంగళవారం నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటరు జాబితా పునఃపరిశీలన తప్పనిసరి మున్సిపల్ ఓటరు జాబితాపై ఫిర్యాదులు రాకుండా వార్డుల వారీగా ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకమైన తుది జాబితాను...