మున్సిపల్ ముసాయిదా ఓటరు జాబితా అభ్యంతరాలన్నీ పరిష్కరిస్తాం జనవరి 10న తుది ఓటరు జాబితా విడుదల : జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్గొండ బ్యూరో, జనవరి 6, డైనమిక్ న్యూస్ మున్సిపల్ వార్డుల వారీగా ఈ నెల 1న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓటరు జాబితాపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. 825 అభ్యంతరాలు నమోదు జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ముసాయిదా ఓటరు జాబితాపై మొత్తం 825 అభ్యంతరాలు అందినట్లు కలెక్టర్ తెలిపారు. ఒక వార్డుకు చెందిన ఓటర్లు మరో వార్డులో నమోదు కావడం, ఒకే కుటుంబ సభ్యులకు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు ఉండటం, ఒక కాలనీ ఓటర్లు రెండు...