చైనా మాంజా అమ్మితే జైలు శిక్షే సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరిక చైనా మాంజాపై సంపూర్ణ నిషేధం

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, జనవరి 6 ప్రజల భద్రతతో పాటు పక్షులు, జంతువుల ప్రాణాల రక్షణ దృష్ట్యా నిషేధిత చైనా మాంజాపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. చైనా మాంజా విక్రయం, వినియోగం పూర్తిగా నిషేధించబడిందని ఆయన స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ వేళ ప్రత్యేక నిఘా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లాలో చైనా మాంజా విక్రయాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని ఎస్పీ పేర్కొన్నారు. నిషేధిత చైనా మాంజా అమ్మితే తప్పనిసరిగా జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించారు. ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజా చైనా మాంజా వల్ల పక్షులు తీవ్రంగా గాయపడటంతో పాటు వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు...