రేపటి నుంచి ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ అమలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కఠిన నిబంధన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి

నల్గొండ బ్యూరో, జనవరి 6, డైనమిక్ న్యూస్ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా తీసుకున్న నిర్ణయం మేరకు రేపటి నుంచి (బుధవారం) నల్గొండ జిల్లా వ్యాప్తంగా ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధనను కఠినంగా అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, తెలిపారు. అన్ని పెట్రోల్ బంకులకు స్పష్టమైన ఆదేశాలు జిల్లా పరిధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ ధరించకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ సరఫరా చేయరాదని ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ నిబంధన అమలుపై ఇప్పటికే పెట్రోల్ బంక్ నిర్వాహకులు, సిబ్బందికి స్పష్టమైన సూచనలు ఇచ్చామని పేర్కొన్నారు. హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన ద్విచక్ర వాహనదారుల్లో...