ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: చీఫ్ విప్ జీవీ

వినుకొండ, డైనమిక్ న్యూస్, జనవరి 3 ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. శుక్రవారం చీఫ్ విప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా దర్బార్‌లో 48 అర్జీలు ప్రజా దర్బార్‌కు నియోజకవర్గం నుంచి మొత్తం 48 అర్జీలు అందగా, వాటిలో పింఛన్లు, రెవెన్యూ, ఇళ్ల స్థలాలకు సంబంధించినవే అధికంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. అర్జీదారుల సమస్యలను స్వయంగా ఓపిగ్గా విన్న చీఫ్ విప్, వాటి పరిష్కారానికి భరోసా కల్పించారు. అధికారులకు తక్షణ ఆదేశాలు అర్జీలకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో మాట్లాడిన ఆయన, సమస్యలను...