ముక్కోటికి ముస్తాబైన మంగళాద్రి నేడు జగన్మోహిని అలంకారం… ఎల్లుండి ఉత్తర ద్వార దర్శనం రెండు రోజులపాటు బంగారు శంఖం తీర్థ ప్రసాదం
డైనమిక్ న్యూస్,మంగళగిరి , డిసెంబర్ 29 మంగళగిరిలోని శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఈనెల 29, 30వ తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆలయం విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈనెల 30న ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈనెల 30వ తేదీ తెల్లవారుజామున 4 గంటల నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా బంగారు గరుడ వాహనంపై ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఒక్కరోజే సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. జగన్మోహిని...