నల్గొండ జీజీహెచ్ లో నిరాశ్రయుల వసతి కేంద్రం ఆకస్మిక తనిఖీ చలి నుంచి రక్షణకు వసతి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
డైనమిక్ న్యూస్ / నల్గొండ బ్యూరో, డిసెంబర్ 29: నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి (జీజీహెచ్) ఆవరణలో ఉన్న పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం తెల్లవారుజామున ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 5 గంటలకే ఆస్పత్రికి చేరుకున్న కలెక్టర్ వసతి కేంద్రంలో అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. వసతి సౌకర్యాల పరిశీలన నిరాశ్రయుల వసతి కేంద్రంలో ఏర్పాటు చేసిన డార్మెటరీలు, మంచాలు, దుప్పట్లు, టాయిలెట్ సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ ఉన్న నిరాశ్రయులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రస్తుతం కేంద్రంలో 17 మంది ఉండగా, మొత్తం 60 మందికి వసతి కల్పించే అవకాశం ఉందని అధికారులు...