నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు తప్పనిసరిప్రజా శాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలుజిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్త్ – డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 26 నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. వేడుకల పేరుతో ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. శాంతిభద్రతల కోసం పోలీస్ ఏర్పాట్లు డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా...