5జీ–6జీ పరిశోధనలకు అంతర్జాతీయ సహకారంవిజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – నార్వేస్‌ నెట్‌వర్క్స్‌ మధ్య ఎంవోయూ

డైనమిక్ న్యూస్,గుంటూరు, డిసెంబర్ 23 గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ మరియు నార్వేకు చెందిన ప్రముఖ టెలికాం సంస్థ నార్వేస్‌ నెట్‌వర్క్స్‌ ఏఎస్‌ మధ్య పరిశోధన, ఆవిష్కరణల రంగంలో దీర్ఘకాలిక భాగస్వామ్యానికి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఈ విషయాన్ని యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పీఎంవీ రావు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నార్వేస్‌ నెట్‌వర్క్స్‌ ఏఎస్‌ సీఈఓ బహార్గుల్‌ ఎమిన్‌కు ఎంవోయూ పత్రాలను అందజేశారు. ఈ ఒప్పందం ద్వారా విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేయనున్నారు. 5జీ, 6జీ, నాన్‌–టెరెస్ట్రియల్‌ నెట్‌వర్క్స్‌, ప్రైవేట్‌ నెట్‌వర్క్స్‌, ఏఐ ఆధారిత కోర్‌ నెట్‌వర్క్స్‌, ఎడ్జ్‌ కంప్యూటింగ్‌,...