ఆధునిక వ్యవసాయంతో రైతులకు లాభాలు – జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గడ్డిపల్లిలో కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శన ప్రారంభం

సూర్యాపేట బ్యూరో, డిసెంబర్ 23 ,డైనమిక్ న్యూస్ సాంకేతిక యుగంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా రైతులకు అధిక లాభాలు చేకూర్చడమే లక్ష్యంగా కృషి వికాస కేంద్రం (కేవీకే) గడ్డిపల్లి నిరంతరం పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.జాతీయ రైతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని కేవీకే – శ్రీ అరబిందో గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళా – వ్యవసాయ ప్రదర్శనను అటారి డైరెక్టర్ షేక్ మీరాతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సాగునీటి వసతులతో సన్న బియ్యానికి భారీ డిమాండ్ ఎన్‌ఎస్‌పీ, ఎస్‌ఆర్‌ఎస్‌పీ, మూసి, పాలేరు ప్రాజెక్టుల ద్వారా సూర్యాపేట...