అతి చిన్న వయస్సులో ప్రజాప్రతినిధిగా గంజాయి గమానిల్ ఈ రోజు 4వ వార్డు సభ్యునిగా ప్రమాణ స్వీకారం

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్,డిసెంబర్ 22 నేరేడు చర్ల మండల పరిధిలో కొత్తగా ఏర్పాటు అయిన లాల్ లక్ష్మీపురం గ్రామంలో యువ రాజకీయానికి చారిత్రక ఆరంభం కానుంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అతి చిన్న వయస్సు 21 సంవత్సరాల్లోనే గంజాయి గమానిల్ 4వ వార్డు సభ్యునిగా విజయం సాధించగా, ఈరోజు అధికారికంగా వార్డు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త గ్రామం – తొలి పాలనకు తొలి అడుగు లాల్ లక్ష్మీపురం గ్రామం ఏర్పడిన తర్వాత నిర్వహించిన తొలి గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామ భవిష్యత్ పాలనకు పునాది వేశాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకుంటూ యువ నాయకత్వానికి పట్టం కట్టారు. 22...