రోడ్డు భద్రత ప్రమాణాల అమలుతో ప్రమాదాల నివారణకు కృషి– జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేటబ్యూరో, డైనమిక్ న్యూస్,20 డిసెంబర్ రోడ్డు భద్రత ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడం ద్వారా ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అన్ని శాఖల సమన్వయంతో తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలపై వీడియో కాన్ఫరెన్స్ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు–2026 నిర్వహణపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, రవాణా శాఖ కమిషనర్ వికాస్ రాజ్‌లతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ప్రమాదాలు, మరణాల్లో గణనీయమైన తగ్గుదలఈ సందర్భంగా కలెక్టర్...