డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసం యత్నం 18 లక్షల రూపాయలు కాపాడిన నల్లగొండ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు
నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 19 డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్‌డ్ టీచర్‌ను భయభ్రాంతులకు గురి చేసి రూ.18 లక్షల రూపాయలు దోచుకునేందుకు ప్రయత్నించిన సైబర్ నేరగాళ్ల పన్నాగాన్ని నల్లగొండ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు భగ్నం చేశారు. సకాలంలో స్పందించి బాధితుడి ఖాతా నుండి డబ్బు బదిలీ కాకుండా కాపాడారు. రిటైర్ టీచర్‌ను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు నల్లగొండ పట్టణానికి చెందిన రిటైర్ టీచర్ పుచ్చకాయల దేవేందర్ రెడ్డి పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త సిమ్ తీసుకొని ఫోన్ కాల్ చేశారు. బెంగళూరులో అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్నారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తూ, తక్షణమే అరెస్ట్ చేస్తామని బెదిరించారు. అరెస్ట్ తప్పించుకోవాలంటే రూ.18...