క్లెయిమ్ చేసుకోని ఆర్థిక ఆస్తుల కోసం ప్రత్యేక కార్యక్రమం మీ డబ్బు – మీ హక్కు” మూడు నెలల జాతీయ ఉద్యమం

నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,డిసెంబర్ 19 క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తులను నిజమైన యజమానులు తిరిగి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం “మీ డబ్బు – మీ హక్కు” అనే ఇతివృత్తంతో మూడు నెలల ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా 2025 డిసెంబర్ 20న నల్గొండ జిల్లాలో ఉమ్మడి శిబిరం నిర్వహించనున్నారు. జాతీయ స్థాయిలో ప్రారంభం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు, ఈ కార్యక్రమాన్ని గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి 2025 అక్టోబర్ 4న గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌లో జాతీయ స్థాయిలో ప్రారంభించారు.ఈ ప్రత్యేక కార్యక్రమం 2025 అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31...