ఈ నెల 21వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి– రాజీయే రాజమార్గం : డీఎస్పీ ప్రసన్న కుమార్
సూర్యాపేటబ్యూరో, డైనమిక్ న్యూస్,డిసెంబర్ 19 ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్వరితగతిన సమస్యల పరిష్కారం జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా ఇరువైపుల సమ్మతితో, తక్కువ సమయంలో సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. కోర్టు కేసుల వల్ల కలిగే సమయ నష్టం, ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు. పరిష్కరించుకునే కేసులివే లోక్ అదాలత్‌లో క్రింది రకాల కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని డీఎస్పీ వివరించారు. క్రిమినల్ కంపౌండబుల్ కేసులు సివిల్ తగాదాలు,ఆస్తి విభజన కేసులు,వైవాహిక జీవితం & కుటుంబ సమస్యలకు సంబంధించిన...