మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి ఎన్నికల సిబ్బంది నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి : జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేటబ్యూరో, డైనమిక్ న్యూస్ డిసెంబర్ 16 ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎన్నికలపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఎన్నికల సిబ్బంది పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, బాధ్యతతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ల పరిశీలన డిసెంబర్ 17న నిర్వహించనున్న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడు, మఠంపల్లి, హుజూర్నగర్ మండలాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికల గణాంకాలు హుజూర్నగర్ డివిజన్ పరిధిలోని హుజూర్నగర్, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడు మండలాలలో 146...