జాతీయ అంధుల టీ–20 క్రికెట్ టోర్నమెంట్ ఘన ప్రారంభం హాజరైన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. కృష్ణ మోహన్, శ్యాప్ చైర్మన్ రవి నాయుడు
డైనమిక్ న్యూస్,గుంటూరు, డిసెంబర్ 16 గుంటూరు జిల్లా నంబూరు సమీపంలోని గోకరాజు గంగరాజు & ఎంఎస్‌కే ప్రసాద్ క్రికెట్ స్టేడియంలో సోమవారం జాతీయ అంధుల టీ–20 క్రికెట్ టోర్నమెంట్ (గ్రూప్–ఏ మ్యాచ్‌లు) ఘనంగా ప్రారంభమైంది. ఇండస్ ఇండ్ బ్యాంక్ నాగేశ్ ట్రోఫీ పేరిట మాజీ అంతర్జాతీయ జట్టు కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్ ఎనిమిదో ఎడిషన్‌గా ఐదు జట్లతో నిర్వహిస్తున్నారు. టోర్నమెంట్‌ను ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. కృష్ణ మోహన్ ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభించారు. అంధ క్రీడాకారులు తమ ప్రతిభతో పాటు ఆత్మవిశ్వాసాన్ని చాటుతూ దేశానికి ఆదర్శంగా...