కాంగ్రెస్ గూండాల దాడుల్లో బీఆర్ఎస్ కార్యకర్త మృతి – మల్లయ్య కుటుంబానికి అండగా ఉంటాం: కేటీఆర్

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 14 సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ గూండాల దాడిలో దారుణంగా హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం పరామర్శించారు. మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ దాడులు: కేటీఆర్ అనంతరం నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ… కేవలం సర్పంచ్, పంచాయతీ ఎన్నికలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతగా భయపడుతోందని విమర్శించారు. రెండేళ్ల పాలనలో అద్భుతాలు చేశామని కాంగ్రెస్ చెబుతున్న మాటలు...