రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు : పోలింగ్ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు దామరచర్ల పోలింగ్ కేంద్రంలో లోపాలపై కలెక్టర్ ఆగ్రహం – ప్రిసైడింగ్ అధికారికి షోకాజ్ నోటీసు ఆదేశం
నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 14 నల్గొండ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు, ఐఏఎస్ అధికారి కొర్ర లక్ష్మితో కలిసి ఆదివారం మిర్యాలగూడ డివిజన్‌లోని దామరచర్ల మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటర్లతో ముఖాముఖి – గుర్తింపు కార్డుల పరిశీలన ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడి, ఓటు హక్కు వినియోగం కోసం తీసుకువచ్చిన గుర్తింపు కార్డులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ ప్రక్రియపై ఓటర్ల నుంచి...