సిపిఐ శత వార్షికోత్సవాలు జయప్రదం చేయాలి సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు పిలుపు
నరసరావుపేట,14 డిసెంబర్, డైనమిక్ న్యూస్ లెనిన్ నగర్ పెద్ద చెరువు సమీపంలో సిపిఐ శత వార్షికోత్సవాల సందర్భంగా ఆదివారం ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు పాల్గొని శత వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిపిఐ నేతలకు ఘన నివాళులు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు, మాజీ కౌన్సిలర్ మల్లెబోయిన వెంకటేశ్వర్లు, సిపిఐ సీనియర్ నాయకులు ఆత్మకూరు సీతారామరాజు, కోసూరు అక్కయ్యలకు ఘన నివాళులు అర్పించారు. సిపిఐ జెండా ఆవిష్కరణ లెనిన్ నగర్ సిపిఐ కార్యాలయం సమీపంలో జరిగిన కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి కామ్రేడ్ సత్యనారాయణ రాజు పార్టీ...